కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ సోదరుడు హస్మత్ ఘనీ అహ్మద్జాయి ( Hashmat Ghani )తాలిబన్లతో చేతులు కలిపారు. తాలిబన్లకు మద్దతు ఇవ్వనున్నట్లు హస్మత్ ప్రకటించినట్లు ఓ కథనం వచ్చింది. తాలిబన్ల దురాక్రమణతో మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిన విషయం తెలిసిందే. రక్తపాతం సృష్టించవద్దు అన్న ఉద్దేశంతో దేశం విడిచి పారిపోయినట్లు అష్రాఫ్ ఓ వీడియో సందేశం ద్వారా తెలిపారు. అయితే తాలిబన్లకు మద్దతు ఇస్తున్నట్లు అష్రాఫ్ ఘనీ సోదరుడు హస్మత్ ప్రకటించడం గమనార్హం. తాలిబన్ నేత ఖలీల్ ఉర్ రెహ్మాన్, మతపెద్ద ముఫ్తీ మహమూద్ జాకిర్ల సమక్షంలో హస్మత్ వారితో చేతులు కలిపారు.