న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరులో కీలక అధ్యాయానికి రంగం సిద్ధమైంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమాక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మొదటిసారి ముఖాముఖి చర్చలో పాల్గొననున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6:30 గంటలకు ఫిలడెల్ఫియా వేదికగా వీరి చర్చా కార్యక్రమం జరుగుతుంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల చర్చా కార్యక్రమాలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అభ్యర్థులు వారు విజయం సాధిస్తే దేశానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఈ చర్చల్లోనే వెల్లడిస్తారు.