US Independence Day | అగ్రరాజ్యం అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం నేడు (US Independence Day). ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రజలు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. బాణాసంచా కాలుస్తూ, కవాతుల మధ్య సందడిగా జరుపుకుంటున్నారు. సాధారణంగా అమెరికన్లు ఏ వేడుకనైనా చాలా ఘనంగా జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. ఇక స్వాతంత్ర్య వేడుకలను మరింత పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. ఈ వేడుకల్లో ప్రధానంగా బాణ సంచా వెలుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఈ ఏడాది కూడా బాణసంచా వెలుగులతో అగ్రరాజ్యం జిగేల్‌మంటోంది.
అమెరికా మీడియా కథనాల ప్రకారం.. ఏటా దేశవ్యాప్తంగా ఈ వేడుకల్లో బాణసంచా కోసమే ఏకంగా రూ.వేల కోట్లు ఖర్చు చేస్తారని తెలిపింది. అంటే ఈ వేడుకలను అమెరికన్లు ఎంత ఘనంగా జరుపుకుంటారో అర్థం చేసుకోవాలి. ఇవాళ అగ్రరాజ్యం 249వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. బ్రిటీష్ పాలనలో ఎన్నో ఏళ్లు అణచివేతకు గురై తిరగబడటంతో ఎట్టకేలకు అమెరికా 1776 జులై 4న స్వేచ్ఛా వాయువు పీల్చుకుంది. అప్పటి నుంచి ఏటా స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ఇక శ్వేతసౌధంలో ఈ వేడుకలు తొలిసారిగా 1801లో జరిగాయి. అప్పటి దేశాధ్యక్షుడు థామస్ జఫర్సన్ ఈ వేడుకలను నిర్వహించారు. అప్పటి నుంచి ఏటా శ్వేతసౌధంలో ఈ వేడులను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు.
#WATCH | Fireworks adorn the sky in Washington, DC, as the United States celebrates its 249th Independence Day. pic.twitter.com/4REfTuiY8u
— ANI (@ANI) July 5, 2025
Also Read..
One Big Beautiful Bill | ట్రంప్ సంతకంతో.. చట్టంగా మారిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు
జపాన్ను నేడు సునామీ ముంచెత్తనుందా.. జపనీస్ బాబా వంగా భవిష్య వాణి నిజమవుతుందా?
బయోమెట్రిక్‌తో విదేశీయుల ట్రాకింగ్.. ట్రంప్ సర్కార్ యోచన