Indonesia | ఇండోనేసియా (Indonesia)లో భారీ అగ్నిప్రమాదం (Fire) జరిగింది. సులవేసి ద్వీపం (Sulawesi island)లోని ఓ నర్సింగ్ హోమ్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 16 మంది సజీవదహనమయ్యారు. మరికొంతమంది గాయపడ్డారు.
స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వెర్ధ దమై రిటైర్మెంట్ హోమ్ (Werdha Damai retirement home)లో ఆదివారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో నర్సింగ్ హోమ్‌లోని వృద్ధులు విశ్రాంతి తీసుకుంటున్నారు. మంటల ధాటికి వారు తమతమ గదుల్లోనే సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, రెస్క్యూ టీమ్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సుమారు 10 మందిని ప్రమాదం నుంచి కాపాడారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
Also Read..
Nur Khan base | 36 గంటల్లో.. 80 డ్రోన్లు.. నూర్ ఖాన్ బేస్‌పై భారత దాడుల్ని అంగీకరించిన పాక్
Mexico Train Derailment | మెక్సికోలో పట్టాలు తప్పిన రైలు.. 13 మంది మృతి, 98 మందికి గాయాలు
Pakistan Cop | కిడ్నీ టచింగ్ యాక్టింగ్.. పాక్ పోలీస్ అధికారిణిపై నెటిజన్ల ట్రోల్స్