Pakistan | పెహల్గామ్ ఉగ్రదాడితో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై దౌత్యపరమైన కఠిన చర్యలను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలో పాక్ (Pakistan) అప్రమత్తమైంది. భారత్ ఏక్షణమైనా వైమానిక దాడులు చేసే అవకాశం ఉందని.. సరిహద్దుల్లో తమ సైన్యాన్ని అప్రమత్తం చేసింది. అంతేకాదు, తన రాడార్ వ్యవస్థలను (radar systems) సియాల్కోట్ ప్రాంతానికి (Sialkot sector) తరలిస్తున్నట్లు తెలిసింది.
పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుకు 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖోర్ కంటోన్మెంట్ (Chor Cantonment) వద్ద టీపీఎస్-77 రాడార్ సైట్‌ను ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. టీపీఎస్-77 మల్టీ-రోల్ రాడార్ (MRR) అనేది అత్యంత సామర్థ్యం గల రాడార్ వ్యవస్థ. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులను గమనించేందుకు, ఎయిర్ ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం దీన్ని ఉపయోగిస్తారు. తాజా పరిస్థితుల్లో భారత వైమానిక దాడులను పసిగట్టడానికి సియాల్కోట్ ప్రాంతానికి పాకిస్థాన్ సైన్యం తన రాడార్ వ్యవస్థలను తరలిస్తున్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
తమపై భారత్ సైనిక దాడి అనివార్యమని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ ఆసిఫ్ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ విదేశీ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత సైనిక చొరబాటు అనివార్యంగా కనిపిస్తున్న కారణంగా తమ సైనిక బలగాలను బలోపేతం చేస్తున్నామని ఆయన చెప్పారు. భారతదేశం సైనిక దాడి చేసే అవకాశం ఉందని పాకిస్థానీ సైన్యం ప్రభుత్వానికి తెలియచేసిందని ఆయన చెప్పారు.
Also Read..
మాపై భారత్ సైనిక దాడి అనివార్యం
16 పాక్ యూట్యూబ్ చానళ్లపై నిషేధం
Pahalgam Attack | ఉగ్రదాడికి సంబంధించి వెలుగులోకి కొత్త వీడియో.. జిప్‌లైన్ ఆపరేటర్‌పై అనుమానాలు..!