న్యూఢిల్లీ : తప్పుడు, రెచ్చగొట్టే, సున్నితమైన మతపరమైన అంశాల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయని ఆరోపిస్తూ కేంద్రం 16 పాకిస్థాన్ యూట్యూబ్ చానళ్లపై సోమవారం నిషేధం విధించింది. ఇందులో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్‌కు చెందిన యూట్యూబ్ చానల్ కూడా ఉన్నది. హోం శాఖ సిఫారసు మేరకు డాన్ న్యూస్, జియో న్యూస్, సమా టీవీ, సునో న్యూస్, ది పాకిస్థాన్ రెఫరెన్స్ తదితర యూట్యూబ్ చానళ్లపై కేంద్రం నిషేధం విధించింది.
ఈ చానళ్లు భారత వ్యతిరేక కంటెంట్‌ను, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కేంద్రం మండిపడింది. పహల్గాం ఉగ్ర దాడి ఘటనలో ఉగ్రవాదులను మిలిటెంట్లుగా పేర్కొన్న బీబీసీ రిపోర్టింగ్ తీరుపైనా కేంద్రం అభ్యంతరం తెలిపింది. ఈ విషయమై ఆ సంస్థ ఇండియా విభాగాధిపతికి లేఖ రాసింది. ఇకపై ఆ సంస్థ రిపోర్టింగ్‌ను పరిశీలిస్తామని విదేశాంగ శాఖ పేర్కొంది.