FBI : భారత్‌పై అమెరికా విధించిన సుంకాలను ఖండించినవాళ్లపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడిన వాళ్ల ఇంటిపై విదేశీ దర్యాప్తు సంస్థ (FBI)ను మోహరిస్తున్నారు ట్రంప్. భారత్‌పై 50 శాతం సుంకాల భారాన్ని తప్పుపట్టినందుకు మాజీ సలహాదారు జాన్ బొల్టన్ను సైతం వదల్లేదు అమెరికా ప్రెసిడెంట్. బోల్టన్ సుంకాలను విమర్శించిన మరుసటి రోజునే ఎఫ్‌బీఐ అధికారులు ఆయన ఇంట్లో సోదాలకు వచ్చారు.
అయితే.. కొన్ని ముఖ్యమైన దస్త్రాల కోసమే ఎఫ్‌బీఐ దాడులు చేసిందని అసోసియేట్ ప్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటివరకైతే బోల్టన్‌ను అరెస్ట్ చేయలేదు. ఆయనపై ఎలాంటి కేసు కూడా నమోదు చేసినట్టు సమాచారం లేదు. బోల్టన్ ఇంటిపై దాడుల గురించి ఎఫ్‌బీఐ డైరెక్టర్ కశ్ పటేల్(Kash Patel) ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘చట్టం ముందు అందరూ ఒకటే. చట్టానికి ఎవరూ అతీతులు కారు. ఎఫ్‌బీఐ ఏజెంట్లు తమ పని తాము చేస్తున్నారు’ అని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు.
🚨 BREAKING: The FBI is now raiding John Bolton’s OFFICE after banging down the door of his DC-area home
This is a GREAT Friday morning so far 🤣
Deep state John Bolton could be facing 10-20 YEARS in prison in this national security probe
MUCH deserved! 🔥 pic.twitter.com/ObcqeGx9NU
— Nick Sortor (@nicksortor) August 22, 2025
ఓవైపు తన ఇంటిపై ఎఫ్‌బీఐ సోదాలు జరుగుతున్నా బోల్టన్ మాత్రం బెదరడం లేదు. ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు.’అమెరికా అధ్యక్షుడు చెబుతున్నట్టుగా ఆయన మధ్యవర్తిత్వం తర్వాత రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో ఎలాంటి పురోగతి కనిపించలేద’ని ఆయన విమర్శించారు. గురువారం భారత్‌పై ట్రంప్ సుంకాలపై ఒక ఇంటర్వ్యూలో బోల్టన్ మాట్లాడారు.
‘ట్రంప్ అనుకోకుండా అధ్యక్షుడు అయ్యారు. ఆయన ధోరణితో ప్రస్తుతం భారత్, అమెరికాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. టారీఫ్‌ల విషయానికొస్తే.. రష్యాపై ట్రంప్ కొత్తగా ఎలాంటి సుంకాలు విధించలేదు. అలానే చైనాపై కూడా ఆయన నోరు మెదపడం లేదు. రష్యా నుంచి భారీగా చమురు కొంటున్నారని భారత్, చైనాలను లక్ష్యంగా చేసుకున్న ట్రంప్.. కేవలం భారత్‌పైనే సుంకాల భారం మోపారు. ఇది చాలా అన్యాయం. ట్రంప్ తీరుతో ప్రస్తుతం ఇండియా మిత్ర దేశాలపై చైనా, రష్యాలకు మరింత దగ్గరవుతోంది’ అని బోల్డన్ పేర్కొన్నారు.
Russia has not changed its goal: drag Ukraine into a new Russian Empire. Moscow has demanded that Ukraine cede territory it already holds and the remainder of Donetsk, which it has been unable to conquer. Zelensky will never do so. Meanwhile, meetings will continue because…
— John Bolton (@AmbJohnBolton) August 22, 2025