Iran | న్యూఢిల్లీ, జనవరి 22 : ఇరాన్‌పై యూరోపియన్ యూనియన్(ఈయూ) కఠిన వైఖరిని తీసుకుంది. ఇరాన్‌కు స్వేచ్ఛ లభిస్తుందని, అణచివేతలను ఎదుర్కొంటామని పరోక్షంగా ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీని ప్రస్తావిస్తూ ఇరాన్ ప్రజలకు ఈయూ బాసటగా నిలిచింది. ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మార్చుకోవడం, ఆ దేశంతో చర్చలు జరిగే అవకాశం ఉందని ప్రకటించిన తరుణంలో ఈయూ నుంచి ఇరాన్‌కు ఈ హెచ్చరికలు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
టెహ్రాన్ వీధుల నుంచి యూరోపియన్ పార్లమెంట్ హృదయం వరకు సందేశం చాలా స్పష్టంగా ఉంది. ఇరాన్‌కు స్వేచ్ఛ లభించాల్సిందే. ఇరాన్‌కు స్వేచ్ఛ లభిస్తుంది. ఇరాన్ ప్రజల ఆకాంక్షలను బలపరచాలని యూరోపియన్ పార్లమెంట్ నిర్ణయించింది అని యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడు రాబెర్టా మెత్సోలా పేర్కొన్నారు.