కాలిఫోర్నియా: ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్స్‌లో ఒకటి ఇటీవల అంతరిక్షం నుంచి అదుపుతప్పి కుప్పకూలింది. ఈ శాటిలైట్‌లోని కొన్ని భాగాలు భూమి వైపునకు దూసుకొస్తున్నాయి. ఈనెల 17వ తేదీన శాటిలైట్ ‘35956’ భూమి నుంచి 418 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. అది హఠాత్తుగా అక్కడి నుంచి కూలిపోవటం మొదలైంది.
స్పేస్ ఎక్స్ దీనిపై వివరణ ఇస్తూ, ‘ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తి ప్రొపెల్షన్ ట్యాంక్‌లో గ్యాస్ బయటకు వెలువడింది. దీంతో అది నాలుగు కిలోమీటర్ల కిందకు దూసుకొచ్చింది. ఆ తర్వాత కొన్ని భాగాలు విడిపోయి మెల్లగా కదలడం మొదలుపెట్టాయి. వారం రోజుల్లో అవి భూమి వాతావరణంలోకి వచ్చి కూలిపోవచ్చు’ అని ఎక్స్‌లో పోస్ట్ చేసింది.