మనలో ఎవరికైనా దురదపెడితే ఏం చేస్తాం? గోక్కుంటాం. అదే జంతువులైతే? ఏ చెట్టుకో, పుట్టకో రుద్దుకుంటాయి. అదే సమయంలో ఎదురుగా ఒక కారు కనిపిస్తే? ఆ ఊహ ఎలా ఉంది? ఇక్కడ అదే నిజంగా జరిగింది. తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియోలో ఒక ఏనుగు రోడ్డు దాటుతోంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒక కారును చూసి ఆగాడా గజేంద్రుడు.
వచ్చి కారు టైరుపై కాలు వేసి పైకెక్కబోయాడు, కుదర్లేదు. దాంతు ముందుకొచ్చి కారు బోనెట్‌పై కూర్చున్నాడు. ఎలాగైనా సరే తన దురద తీర్చుకోవాలని ఆ కారుతో కుస్తీపట్టాడు. కానీ చివరకు కారు ముందు భాగం దెబ్బతిన్నదే కానీ దురద తీరలేదు. దాంతో ఒకడుగు వెనక్కు వేశాడు. అదే అదను తీసుకున్న కారులోని డ్రైవర్ కారు వెనక్కు తిప్పి రయ్యిమంటూ పారిపోయాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందీ తెలియదు కానీ.. నెటిజన్లకు మాత్రం కావలసినంత వినోదం పంచుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వలేక చస్తున్నారు. ‘దురద పుడితే ఏం చేస్తాం మరి?’అని కొందరు ప్రశ్నిస్తుంటే.. ‘ఆ కారులో నేనుంటే నవ్వు ఆపుకోలేక చచ్చేవాడిని’ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ‘ఈ జరిగిన డ్యామేజీని ఇన్సూరెన్స్ కంపెనీకి ఎలా వివరించాలి?’ అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
What do you do when you’re itchy and you’re an elephant? 😂 pic.twitter.com/fYUMYdlO5z
— Buitengebieden (@buitengebieden) September 6, 2022