మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Sep 01, 2020 , 18:23:06

60 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లిచేసుకున్నారు.. ఎందుకో తెలుసా?

60 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లిచేసుకున్నారు.. ఎందుకో తెలుసా?

నెబ్రాస్కా:  ‘పెళ్ళంటె పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసి నూరేళ్లు..’ ఈ పాట పెళ్లికి అసలైన నిర్వచనం చెబుతోంది. ప్రతి ఒక్కరి జీవతంలో మరిచిపోలేని ఘట్టం ఇది.  ఆ రోజు తీయించుకున్న ఫొటోలు.. వీడియోలు జీవతకాలం మధురమైన జ్ఞాపకాలను పంచుతాయి. అయితే, ఓ జంట తమ పెళ్లి వేడుకలను పునసృష్టి చేశారు. తమకు పెళ్లైన 60 ఏళ్ల తర్వాత మళ్లీ పాత పద్ధతిలోనే వివాహం చేసుకున్నారు. ఎందుకంటే గత జ్ఞాపకాలను మళ్లీ సజీవంగా నిలిపేందుకేనని ఈ వృద్ధ జంట ప్రేమగా చెబుతోంది.

నెబ్రాస్కాలోని మార్విన్, లూసిల్ స్టోన్ భార్య భర్తలు. వీరి వివాహం 1960లో జరిగింది. స్టెర్లింగ్‌లోని ఒక చిన్న చర్చిలో ఈ జంట వివాహం చేసుకున్నప్పుడు ఫొటోషూట్‌ కూడా నిర్వహించారు. అయితే, ఆరు దశాబ్దాల తర్వాత, వారు అచ్చం పెళ్లినాటివలె రెడీ అయ్యారు. పెళ్లి దుస్తుల్లో ఈ వృద్ధజంట తళుక్కుమంది. పెళ్లినాడు ఎలా ఫొటోషూట్‌ నిర్వహించారో అలాగే, ఇప్పుడు కూడా ఫొటోలు, వీడియో తీయించుకున్నారు. ఈ ఫొటోషూట్‌ నిర్వహించిన కేటీ ఓట్రీ ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టగా, నెటిజన్ల హృదయాలను గెలుచుకున్నాయి. 1,100 మంది షేర్‌ చేయగా, 1,800 లైకులు వచ్చాయి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo