Imran Khan | పాకిస్థాన్ (Pakistan) రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) సోదరి అలీమా ఖానుమ్ (Aleema Khanum)పై దాడి జరిగింది. సొంత పార్టీ మద్దతుదారులే ఆమెపై దాడి చేశారు. రావల్సిండి (Rawalpindi)లోని అడియాలా జైలు (Adiala Jail) వెలుపల విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో పీటీఐ మద్దతుదారులు ఆమెపై కోడిగుడ్డు (Egg thrown at Imran Khans sister) విసిరారు.
తోషాఖానా కేసుకు (Toshakhana case) సంబంధించి అడియాలా జైలులో జరుగుతున్న విచారణకు హాజరైన ఇమ్రాన్ సోదరి .. అనంతరం జైలు బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో ఓ మహిళ ఆమెపైకి కోడిగుడ్డు విసిరింది. ఈ ఆకస్మిక పరిణామంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అప్రమత్తమైన పోలీసులు దాడికి పాల్పడిన మహిళను అరెస్ట్ చేశారు. ఆమెతో పాటూ మరో మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read..
PM Modi | ట్రంప్ సానుకూల వైఖరి అభినందనీయం : ప్రధాని మోదీ
ఇండియన్స్.. ఇక చాలు!.. అమెరికా అంతా ఇప్పటికే మీతో నిండిపోయింది!
మహిళలైతే ముట్టుకోం!.. అఫ్గాన్‌లో సహాయ చర్యల్లోనూ మత ఛాందసం