కాబూల్: మెడికల్ విద్యలో ఆడవాళ్లను బ్యాన్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్ ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మిడ్వైఫ్, నర్సింగ్ లాంటి కోర్సులను అమ్మాయిలు చదవరాదు అని తాలిబన్ ఇటీవల హుకూం ఇచ్చింది. అయితే తాలిబన్ విధించిన ఆంక్షలపై ఇప్పటికే అంతర్జాతీయ దేశాలు స్పందిస్తున్నాయి. తాజాగా ఆ దేశ క్రికెటర్ రషీద్ ఖాన్(Rashid Khan) రియాక్ట్ అయ్యారు. ఎక్స్ అకౌంట్లో అతను తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్ఘన్ మెడికల్ సంస్థల్లో సోదరి, తల్లులు చదవకుండా ఆంక్షలు విధించడం నిరుత్సాహాన్ని కలిగిస్తోందన్నారు.
ఇస్లామిక్ ప్రబోధాల్లో విద్య కేంద్ర బిందువుగా నిలుస్తుందని రషీద్ తెలిపారు. పురుషులకు, మహిళలకు జ్ఞానార్జన కీలకమైందన్నారు. స్త్రీ,పురుషులిద్దరూ సమానంగా విద్యను అభ్యసించాలని ఖురాన్ సూక్తిని తెలిపారు. తాలిబన్ నిర్ణయం వల్ల అమ్మాయిల భవిష్యత్తు మాత్రమే కాదు, మన సమాజ సమస్యలను కూడా ఎత్తు చూపుతోందన్నాడు. సోషల్ మీడియా అమ్మాయిలు వ్యక్తం చేస్తున్న ఆవేదన వాళ్ల పోరాటాన్ని ప్రస్పుటిస్తుందన్నారు. ఆఫ్ఘనిస్తాన్ తీసుకున్న నిర్ణయాన్ని పునర్ సమీక్షించుకోవాలని రషీద్ అభ్యర్థించారు.
🤲🏻🤲🏻🇦🇫🇦🇫 pic.twitter.com/rYtNtNaw14
— Rashid Khan (@rashidkhan_19) December 4, 2024