Earthquake | చైనాలో 7.2 తీవ్రతతో భారీ భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపణలు
చైనాలో అర్ధరాత్రి వేళ భారీ భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత దక్షిణ జిన్యాంగ్ (Xinjiang) ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 7.2గా నమోదయింది.
న్యూఢిల్లీ: చైనాలో అర్ధరాత్రి వేళ భారీ భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత దక్షిణ జిన్యాంగ్ (Xinjiang) ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 7.2గా నమోదయింది. భూ అంతర్భాగంలో 80 కిలో మీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఆఫ్ సీస్మోలజీ (NCS) తెలిపింది. ఈ భూకంప తీవ్రత మన దేశ రాజధాని ఢిల్లీని కూడా తాకింది. ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో బలమైన భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
కాగా, చైనాలో భూకంపం కారణంగా కిర్గిజిస్తాన్-జిన్జియాంగ్ సరిహద్దుల్లో పలువురు గాయపడ్డారు. ఇండ్లు కూడా కూలిపోయాయని అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిన్జియాంగ్ పరిధిలో 27 రైళ్లను రైల్వే శాఖ నిలిపివేసింది. భూప్రకంపనలు సంభవించిన ప్రాంతంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వాయవ్య చైనాలో మొత్తం 14 సార్లు భూమి కంపించిందని చైనీస్ మీడియా వెల్లడించింది. వాటి తీవ్రత 3.0 నుంచి అంతకంటే ఎక్కువగా నమోదయిందని పేర్కొన్నాయి. అత్యధికంగా 5.3 తీవ్రత రికార్డయిందని తెలిపాయి. భూకంపం కేంద్రం ఉషు కౌంటీకి సమీపంలో ఉన్నదని వెల్లడించాయి. ఇక కజఖిస్థాన్లో కూడా 6.7 తీవ్రతతో భూమి కంపించిందని అత్యవసర శాఖ ప్రకటించింది. దీంతో దేశంలోని అతిపెద్ద నగరమైన అల్మటీలో ప్రజలు ఇండ్ల నుంచి పరుగులు తీశారని పేర్కొంది.
Earthquake of Magnitude:7.2, Occurred on 22-01-2024, 23:39:11 IST, Lat: 40.96 & Long: 78.30, Depth: 80 Km ,Location: Southern Xinjiang, China for more information Download the BhooKamp App https://t.co/FYt0ly86HX@KirenRijiju @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/E184snmSyH
— National Center for Seismology (@NCS_Earthquake) January 22, 2024
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Almaty
- china
- Delhi
- Earthquake
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

