ఫైజాబాద్: అఫ్గానిస్థాన్‌లోని ఫైజాబాద్‌లో మరోసారి భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 2.35 గంటల సమయంలో ఫైజాబాద్ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. ఫైజాబాద్‌కు 267 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. తెల్లవారుజామున భూకంపం రావడంతో ప్రజలు ఇండ్లనుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, ఈ భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.
Earthquake of Magnitude 4.1 on the Richter Scale strikes Afghanistan pic.twitter.com/GU7P9OIMFu
— ANI (@ANI) March 1, 2023
రెండు రోజుల క్రితం ఫైజాబాద్‌లో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 4.05 నిమిషాలకు 4.1 తీవ్రతతో భూమి కంపించింది. అదేవిధంగా ఉదయం 5.30 గంటలకు తజికిస్థాన్‌లో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. దీనితీవ్రత 4.3గా నమోదయిందిన ఎన్సీఎస్ వెల్లడించింది.