Nepal Earthquake | నేపాల్‌లో మరోసారి భూకంపం.. అయోధ్యలోనూ కంపించిన భూమి
హిమాలయ దేశం నేపాల్‌లో (Nepal) వరుస భూకంపాలతో (Earthquake) వణికిపోతున్నది. శుక్రవారం రాత్రి భారీ భూకంపం రాగా, శనివారం మధ్యాహ్నం కూడా భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున మరోసారి ప్రకంపణలు వచ్చాయి.
కఠ్మండూ: హిమాలయ దేశం నేపాల్‌లో (Nepal) వరుస భూకంపాలతో (Earthquake) వణికిపోతున్నది. శుక్రవారం రాత్రి భారీ భూకంపం రాగా, శనివారం మధ్యాహ్నం కూడా భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున మరోసారి ప్రకంపణలు వచ్చాయి. ఉదయం 4.38 గంటలకు రాజధాని కఠ్మండూలో (Kathmandu) భూమి కంపించింది. దీని తీవ్రత 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. కఠ్మండూకు 169 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది.
Earthquake of Magnitude:3.6, Occurred on 05-11-2023, 04:38:20 IST, Lat: 28.63 & Long: 83.94, Depth: 10 Km ,Location: 169km NW of Kathmandu, Nepal for more information Download the BhooKamp App https://t.co/i07qTLatFl @KirenRijiju @moesgoi @Dr_Mishra1966 @Ravi_MoES pic.twitter.com/gbw29Q4TPR
— National Center for Seismology (@NCS_Earthquake) November 4, 2023
అంతకు ముందు భారత్‌లోని ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) ఉన్న అయోధ్యలో (Ayodhya) కూడా భూమి కంపించింది. ఆదివారం వేకువజామున 1.07 గంటలకు భూకంపం వచ్చింది. దీని తీవ్రత 3.6గా నమోదయిందని ఎన్సీఎస్ తెలిపింది.
Earthquake of Magnitude:4.5, Occurred on 05-11-2023, 01:25:36 IST, Lat: 37.64 & Long: 74.21, Depth: 10 Km ,Location: 328km ENE of Fayzabad, Afghanistan for more information Download the BhooKamp App https://t.co/BOzIuDvwtm @KirenRijiju @moesgoi @Dr_Mishra1966 @Ravi_MoES pic.twitter.com/V8SUTOYfUO
— National Center for Seismology (@NCS_Earthquake) November 4, 2023
అదేవిధంగా అఫ్ఘానిస్థాన్లోని (Afghanistan) ఫైజాబాద్‌లో (Fayzabad) కూడా భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున 1.25 గంటలకు ఫైజాబాద్‌లో 4.5 తీవ్రతతో భూమి కంపించింది.
Earthquake of Magnitude:3.6, Occurred on 05-11-2023, 01:07:22 IST, Lat: 28.73 & Long: 82.26, Depth: 10 Km ,Location: 215km N of Ayodhya, Uttar Pradesh, India for more information Download the BhooKamp App https://t.co/Lypi7Q1Egd @KirenRijiju @Dr_Mishra1966 @moesgoi @Ravi_MoES pic.twitter.com/svzl1KPtSd
— National Center for Seismology (@NCS_Earthquake) November 4, 2023
కాగా, శుక్రవారం రాత్రి 11.32 గంటలకు నేపాల్‌లోని జాజర్కోట్ (Jajarkot)లో 6.4 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో 157 మంది మరణించగా, డజన్ల కొద్ది జనాలు గాయపడ్డారు. భారీగా ఇండ్లు నేలమట్టమయ్యాయి. వంల కొద్ది ఇండ్లు ధ్వంసమైన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

