కొత్తగూడెం ప్రగతి మైదాన్: మావోయిస్టుల ఆయుధ కర్మాగారాన్ని గుర్తించిన భద్రతా దళాలు దానిని ధ్వంసం చేసిన ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. సుక్మా జిల్లా అడవుల్లో మావోయిస్టుల కోసం భద్రతా దళాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
ఈ క్రమంలో నక్సల్స్ ఆయుధ ఫ్యాక్టరీని జవాన్లు గుర్తించి భారీ డంపును స్వాధీనం చేసుకొని కర్మాగారాన్ని ధ్వంసం చేశారు.జవాన్ల రాకను గమనించిన మావోయిస్టులు తమ ఆయుధ, వస్తు సామగ్రిని అక్కడే వదిలి పారిపోయారు.