న్యూడిల్లీ: బొమ్మ అనుకుని రైఫిళ్లకు వాడే టెలిస్కోప్‌తో ఒక బాలుడు ఆడుకోవడం సోమవారం జమ్ము కశ్మీర్లో సంచలనం సృష్టించింది. అదీ కూడా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రధాన కార్యాలయానికి సమీపంలో దొరకడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఆస్రాబాద్లో ఆరేండ్ల కుర్రాడు బొమ్మ అనుకుని టెలిస్కోప్‌తో ఆడుకుంటుండటాన్ని గమనించిన అధికారులు ఆ కుర్రాడి తల్లిదండ్రులను దాని గురించి ప్రశ్నించారు.
దగ్గరలోని చెత్త డంప్ నుంచి తమ కొడుకు దానిని తెచ్చాడని వారు చెప్పారు. చైనాలో తయారైన ఆ టెలిస్కోప్‌ను స్నిపర్ రైఫిల్‌కు అమర్చి దూరంలోని లక్ష్యాలను గురి తప్పకుండా షూట్ చేయవచ్చు. దీంతో ఉలిక్కిపడ్డ అధికారులు ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు.