రష్యాలో వరుస భూకంపాలు ప్రజలను వణికిస్తున్నాయి. తాజాగా కురిల్ దీవులలో ఆదివారం మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 7.0 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం ధాటికి పలు నగరాల్లోని భవనాలు, ఇళ్లు తీవ్రంగా కంపించాయి. ప్రజలు భయంతో పరుగులు తీశారు.
అయితే భూకంపం కారణంగా ఎలాంటి మరణాలు సంభవించినట్టు గానీ, ఆస్తి నష్టం జరిగినట్టు కానీ సమాచారం లేదని రష్యా అత్యవసర పరిస్థితుల శాఖ తెలిపింది. కమ్చట్కా ద్వీపకల్పంలో ఉన్న క్రాషెన్నీనికోవ్ అగ్నిపర్వతం 600 ఏండ్ల తర్వాత శనివారం అర్ధరాత్రి తొలిసారిగా బద్దలైంది. ఈ అగ్నిపర్వతం 6 వేల మీటర్ల ఎత్తుకు బూడిదను గాలిలోకి విడుదల చేసింది. దీంతో ఆరెంజ్ హెచ్చరికను జారీ చేశారు.