Earthquake | పపువా న్యూగినియాలో భారీ భూకంపం.. 6.2 తీవ్రత
పపువా న్యూగినియాలో (Papua New Guinea) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. న్యూగినియాలోని కండ్రియాన్లో (Kandrian) శనివారం రాత్రి 9.24 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) భూమి కంపించింది .
పోర్ట్ మోర్స్‌బే: పపువా న్యూగినియాలో (Papua New Guinea) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. న్యూగినియాలోని కండ్రియాన్లో (Kandrian) శనివారం రాత్రి 9.24 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) భూమి కంపించింది. దీని తీవ్రత 6.2గా నమోదయిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. భూఅంతర్భాగంలో 38.2 కిలోమీటర్ల లోతులు కంపించిందని వెల్లడించింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదు.
అఫ్గానిస్థాన్‌లోని (Afghanistan) ఫైజాబాద్‌లో (Fayzabad) కూడా భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున 2.14 గంటలకు ఫైజాబాద్ సమీపంలో 4.3 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. ఫైజాబాద్‌కు 273 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
ఇక శనివారం ఉత్తర జపాన్ (Japan)లోని హొక్కయిడో (Hokkaido)లో భారీ భూకంపం (Earthquake) సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని యూఎస్ జియోలాజికల్ సర్వే, జపాన్ వాతావరణ సంస్థ తెలిపాయి. తీరప్రాంత నగరాలైన కుషిరో, నెమురోలను భూకంపం వణించినా.. ఎలాంటి సునామీ (tsunami) హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

