Viral | అదొక వింత అనుభవం.. చిరాకు తెప్పించే వైనం.. ఓ విమానం 13 గంటల పాటు ఆకాశంలో చక్కర్లు కొట్టి.. అది ఎక్కడైతే టేకాఫ్ అయ్యిందో.. అదే ప్లేసులో మళ్లీ దించేసింది. విమానం ఎక్కిన గంటల సమయం తర్వాత మళ్లీ అక్కడే దించేయడంతో అందులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. చివరకు ఎయిర్‌లైన్స్‌ను తిట్టుకుంటూ ఇంటికి దారి పట్టారు. గత శుక్రవారం దుబాయిలో జరిగిన ఈ విచిత్ర సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఎమిరేట్స్ విమానం దుబాయి ఎయిర్‌పోర్టు నుంచి న్యూజిలాండ్‌కు ఆక్లాండ్‌కు బయల్దేరింది. అయితే భారీ వరదల కారణంగా ఆక్లాండ్ విమానాశ్రయం నీటితో నిండిపోయింది. దీంతో అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలిసేప్పటికి ఎమిరేట్స్ విమానం సగం దూరం వరకు వెళ్లిపోయింది. అంటే దాదాపు 4 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. అలాగే ముందుకు వెళ్దామంటే ఆక్లాండ్ ఎయిర్‌పోర్టులో దిగే పరిస్థితి లేదు. అందుకే దేవుడా అంటూ.. పైలట్లు మళ్లీ విమానాన్ని వెనక్కి తిప్పారు. జాగ్రత్తగా తీసుకొచ్చి మళ్లీ దుబాయి ఎయిర్‌పోర్టులోనే దించేశారు. తీరా విమానం ల్యాండ్ అయ్యాక.. తాము ఎక్కిన దుబాయి ఎయిర్‌పోర్టులోనే విమానం ఉండటం చూసి కంగుతిన్నారు. ఎయిర్‌లైన్స్‌పై అసహనం వ్యక్తం చేశారు. అయితే ఆక్లాండ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని వెల్లడించింది. దీంతో చేసేదీమి లేక తిట్టుకుంటూ ప్రయాణికులు ఇంటిదారిన పట్టారు.
Viral Video | వామ్మో.. ఒకే చేతిపై.. ఒకేసారి 16 దోశ ప్లేట్స్ తీసుకెళ్లిన వెయిటర్..!
వైరల్ వీడియో : ఝూమే జో పఠాన్ సాంగ్‌కు తల్లీ కొడుకుల మెస్మరైజింగ్ డ్యాన్స్
రైలు కిందపడి అధికారి బలవన్మరణం
వైరల్ వీడియో : రోబోటిక్ అవుట్లెట్ ఓపెన్ చేసిన మెక్‌డొనాల్డ్స్
లేఆఫ్స్ గుబులు : టెకీల కష్టాలను కండ్లకు కట్టిన కంటెంట్ క్రియేటర్!