న్యూఢిల్లీ : ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడుతుండటం, రాబడి పడిపోతుండటంతో టెక్ దిగ్గజాల నుంచి పలు కంపెనీలు మాస్ లేఆఫ్స్‌కు తెగబడటంతో టెకీల్లో గుబులు రేగుతోంది. జాబ్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితికి అద్దం పడుతూ కంటెంట్ క్రియేటర్ శ్రద్ధ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
A laid off techie….this is so funny @AiyyoShraddha pic.twitter.com/uIlVwHeX21
— Harsh Goenka (@hvgoenka) January 30, 2023
ఈ వీడియోను పారిశ్రామిక దిగ్గజం హర్ష్ గోయంకా ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ క్లిప్‌లో ఉద్యోగ అవకాశం కోసం టెకీ కింద కూర్చుని ఉన్నట్టు ఊహాజనిత సన్నివేశంతో శ్రద్ధ ఈ వీడియోను రికార్డు చేశారు. టెక్ పరిశ్రమలో కొలువుల కోతకు అద్దం పట్టేలా టెకీ, హెచ్ఆర్ మధ్య సంభాషణ సాగిన తీరు ఆకట్టుకుంటుంది.
ఈ వీడియోను షేర్ చేసినప్పటి నుంచి 1.45 లక్షల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. శ్రద్ధ వీడియో లేఆఫ్స్ ప్రకంపనలకు ప్రతిరూపంగా ఉందని పలువురు యూజర్లు కామెంట్ చేశారు. లేఆఫ్స్‌కు గురైన బాధితుల పరిస్ధితిని ఆమె పర్ఫెక్ట్గా ప్రెజెంట్ చేశారని యూజర్లు కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు. నటుడు రితీష్ దేశ్‌ముఖ్ సైతం ఈ వీడియోపై ప్రశంసలు గుప్పించారు.