వైరల్ వీడియో : రోబోటిక్ అవుట్లెట్ ఓపెన్ చేసిన మెక్‌డొనాల్డ్స్
అమెరికాలోని టెక్సాస్‌లో ఉద్యోగులతో పనిలేకుండా రోబోలతో నడిచే అవుట్‌లెట్‌ను గత ఏడాది డిసెంబర్లో మెక్‌డొనాల్డ్స్ ఓపెన్ చేసింది. ఈ అవుట్‌లెట్‌లో ఆహారం తయారుచేయడం దగ్గర నుంచి సర్వ్ చేయడం వరకూ రోబోలే అన్నీ మేనేజ్ చేస్తాయి.
న్యూఢిల్లీ : టెక్నాలజీ పెరగడంతో లాభంతో పాటు నష్టాలూ మానవాళిని వెంటాడుతున్నాయి. టెక్నాలజీ అప్‌గ్రేడ్ కావడంతో కష్టమైన పనులూ అవలీలగా చేసుకోగలుగుతుండగా యాంత్రీకరణతో వేలాది కొలువులకు కోతపడుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక అమెరికాలోని టెక్సాస్‌లో ఉద్యోగులతో పనిలేకుండా రోబోలతో నడిచే అవుట్‌లెట్‌ను గత ఏడాది డిసెంబర్లో మెక్‌డొనాల్డ్స్ ఓపెన్ చేసింది. ఈ అవుట్‌లెట్‌లో ఆహారం తయారుచేయడం దగ్గర నుంచి సర్వ్ చేయడం వరకూ రోబోలే అన్నీ మేనేజ్ చేస్తాయి.
A first-of-its-kind McDonald’s has opened in White Settlement, TX, a suburb of Ft. Worth. The location is almost entirely automated, with machines handling every aspect of the consumer experience — including the drive-thru window.
(via @kaansanity) pic.twitter.com/kecMQZiAfL
— NowThis Impact (@nowthisimpact) January 29, 2023
మెక్‌డొనాల్డ్స్ ప్రయోగాత్మకంగా ఈ రెస్టారెంట్‌ను ఓపెన్ చేసింది. కన్సానిటీ అనే టిక్‌టాకర్ ఈ అవుట్‌లెట్‌ను సందర్శించి తన అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఈ క్లిప్‌ను నౌదిస్ అనే పేజ్ ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ వీడియోలో టిక్‌టాకర్ ఈ చిన్న, పూర్తిస్ధాయి ఆటోమేటిక్ అవుట్‌లెట్‌ను చూపించారు. ఆటోమేటిక్ కన్వేయర్ బెల్ట్ ఆర్డర్ చేసిన ఆహార పదార్ధాలను చేరవేస్తుండటం కనిపించింది. ఈ ప్రక్రియలో ఎక్కడా ఉద్యోగుల ప్రమేయం కనిపించదు.
ఈ వీడియోను నెట్టింట షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ లక్ష మందికి పైగా వీక్షించారు. ఇంతకుముందెన్నడూ లేని రీతిలో కస్టమర్లకు వేగంగా సులభంగా ఆర్డర్లను చేరవేసేందుకు నూతన పద్ధతుల్లో ఈ అవుట్‌లెట్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించామని మెక్‌డొనాల్డ్స్ బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొంది. కస్టమర్లకు నూతన పద్ధతుల్లో సర్వీస్ ఇవ్వడమే కాకుండా ఈ రెస్టారెంట్‌లోని టెక్నాలజీ వారికి వేగంగా, కచ్చితత్వంతో ఆర్డర్లను చేరవేయడానికి ఉపకరిస్తుందని టెస్ట్ రెస్టారెంట్ ప్రతినిధి కీత్ వానిక్ బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

