గురువారం 22 అక్టోబర్ 2020
International - Oct 03, 2020 , 15:19:14

మద్యంమత్తులో వాషింగ్‌మెషీన్‌లోకి.. బయటకురాలేక యువతి సతమతం!

మద్యంమత్తులో వాషింగ్‌మెషీన్‌లోకి.. బయటకురాలేక యువతి సతమతం!

లండన్‌: మద్యం మత్తులో మనుషులు ఆలోచనాశక్తి, వివేకం కోల్పోతారు. అసలేం చేస్తున్నారో వారికి తెలియదు. మద్యం తాగాక ఫ్రెండ్స్‌ విసిరిన చాలెంజ్‌ను స్వీకరించి ఓ యువతి కష్టాలపాలైంది. వాషింగ్‌మెషీన్‌లోకి దూరి, బయటకు రాలేక విలవిల్లాడింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆమెను బయటకు తీయాల్సి వచ్చింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. 

ఈస్ట్ యార్క్‌షైర్‌లోని హల్‌కు చెందిన రోసీ కోల్ (21) తన హౌస్‌మేట్స్‌తో కలిసి డ్రింక్‌ చేసింది. అందులో ఒకరు చాలెంజ్‌ విసరగానే వెంటనే వాషింగ్‌ మెషీన్‌లోకి దూరిపోయింది. అయితే, నడుము భాగం నుంచి కాళ్లవరకు లోపలే ఇరుక్కుపోవడంతో బయటపడడం కష్టసాధ్యమైంది. అక్కడున్నవారు బయటకులాగేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. దీంతో ఫైర్‌సిబ్బందికి ఫోన్‌చేశారు. వారు వచ్చి చూసి అవాక్కయ్యారు. తాము చిన్నపిల్లవాడు చిక్కుకున్నాడేమో అనుకున్నామని, 21 ఏళ్ల యువతి ఇందులో ఎలా ఇరుక్కుపోయిందంటూ ఆశ్చర్యపోయారు. అనంతరం ఆమెను రక్షించారు.    

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo