కోపెన్హెగన్: డెన్మార్క్‌లో గత వారం రోజుల నుంచి డ్రోన్లు(Denmark Drones) కలవరం సృష్టిస్తున్నాయి. దేశంలోని విమానాశ్రయాల వద్ద డ్రోన్లు అకస్మాత్తుగా కనిపిస్తున్నాయి. దీంతో అనేక చోట్ల ఎయిర్‌స్పేస్ ఆందోళనకరంగా మారింది. రాజధాని కోపెన్‌హెగన్‌లోని ఎయిర్‌పోర్టు వద్ద కూడా సోమవారం డ్రోన్లు సందడి చేశాయి. సుమారు మూడు పెద్ద సైజు డ్రోన్లు కనిపించాయి. దీంతో ఆ విమానాశ్రయంలో టేకాఫ్‌లు, ల్యాండింగ్‌లు ఆలస్యం అయ్యాయి. కొన్ని గంటల పాటు విమాన రాకపోకలకు బ్రేక్ పడింది.
దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల వద్ద డ్రోన్లు విహరించడంపై ఇవాళ ఆ దేశ రక్షణ మంత్రి స్పంఇంచారు. ఓ ప్రొఫెషనల్ వ్యక్తి డ్రోన్ల వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు మంత్రి ట్రోయిల్స్ లుండ్ పోల్సెన్ తెలిపారు. చాలా వ్యవస్థీకృతంగా ఇదంతా జరుగుతోందన్నారు. ఇదో హైబ్రిడ్ అటాక్ అని రక్షణ మంత్రి పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం మిలిటరీకి నేరుగా ఎటువంటి ప్రమాదం లేదని ఆయన అన్నారు. డ్రోన్ల దాడిని ఎదుర్కొనేందుకు యురోపియన్ యూనియన్ దేశాలు సమాయత్తం కావాలని డెన్మార్క్ మంత్రులు పిలుపునిచ్చారు.
ఆల్బోర్గ్ విమానాశ్రయాన్ని పాక్షికంగా మూసివేశారు. దక్షిణ ప్రాంతంలో ఉన్న ఎస్బ్‌జెర్గ్, సోండర్బోర్గ్, స్క్రిడ్స్ట్రప్ పట్టణాల్లో కూడా డ్రోన్ల కలకలం సృష్టించాయి. డ్రోన్లు కనిపించినా.. విమానాశ్రయాలను మూసివేయలేదు. డ్రోన్ల కలకలం వెనుక రష్యా పాత్ర ఉండి ఉంటుందని డెన్మార్క్ ప్రధాని మిట్టె ఫ్రెడరిక్సన్ పేర్కొన్నారు. రష్యానే ఆ పని చేసి ఉంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా తెలిపారు.
డ్రోన్ల ప్రయోగంలో రష్యా పాత్ర ఉన్నట్లు ఆధారాలు లేవని రక్షణ మంత్రి ట్రోయిల్స్ పేర్కొన్నారు. ప్రజలకు భద్రతాపరమైన సమస్యలు రాకూడదన్న ఉద్దేశంతో డ్రోన్లను కూల్చలేదని డిఫెన్స్ చీఫ్ మైఖేల్ హైడ్గార్డ్ తెలిపారు.