Sudan Hospital : ఆఫ్రికా దేశమైన సూడాన్ (Sudan) లో సైన్యం, పారామిలిటరీ గ్రూప్ ‘ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF)’ బలగాల మధ్య మూడేళ్లుగా ఆధిపత్యపోరు కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే తాజాగా ఈస్ట్ దార్ఫూర్లోని ఓ ఆస్పత్రిపై జరిగిన డ్రోన్ దాడిలో 64 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 13 మంది చిన్నారులు, ఒక వైద్యుడు, ఇద్దరు నర్సులు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది.
ఈ డ్రోన్ దాడిలో 64 మంది మరణించడమేగాక మరో 89 మంది గాయపడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. ‘ఇప్పటివరకు ఆస్పత్రులపై జరిగిన దాడుల్లో 2,000 మందికిపైగా మృతిచెందారు. ఇదిలావుంటే ఆస్పత్రిపై దాడికి పాల్పడింది సైన్యమేనని ఆర్ఎస్ఎఫ్ ఆరోపించింది. అయితే దీనిని సైన్యం పూర్తిగా ఖండించింది.