వాషింగ్టన్: యుద్ధంలో ఇరాన్ను ఓడించిన తర్వాత, హొర్ముజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలపై అమెరికా సుంకం విధించాలని అధ్యక్షుడు ట్రంప్ కోరుకుంటున్నారు. హొర్ముజ్ జలసంధిపై తన పట్టును సడలించకపోతే, ఇరాన్ను మొత్తంగా నాశనం చేస్తానని ట్రంప్ బెదిరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యూహాత్మక జలమార్గంలో ప్రయాణించే నౌకలపై అమెరికా సుంకం విధించాలని ఆలోచిస్తున్నట్టు ఆయన తాజాగా సూచించారు. విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు ట్రంప్ పై విధంగా స్పందించారు.
‘మరి మనం సుంకం విధిస్తే ఎలా ఉంటుంది? వాళ్లకు ఆ అవకాశం ఇవ్వడం కంటే మనమే సుంకం విధించటం మేలు?’ అని ఆయన బదులిచ్చారు. హొర్ముజ్ జలసంధిలో రోజూ 120 నౌకలు రాకపోకలు సాగిస్తుంటాయి. కొన్ని నౌకలపై ఇరాన్ 2 మిలియన్ డాలర్ల వరకు టోల్ను వసూలు చేస్తున్నది. ఒకవేళ ఇదే ఫీజును అమెరికా కొనసాగిస్తే, రోజూ 240 మిలియన్ డాలర్లు దక్కుతాయట.