వాషింగ్టన్ : నిన్న మొన్నటి వరకు హెచ్-1బీ వీసా ఉద్యోగులంటేనే ఒంటికాలిపై లేచి వారిపై కఠిన ఆంక్షలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మెల్లిమెల్లిగా తత్తం బోధపడుతున్నట్టుంది. విదేశీ ఉద్యోగుల అవసరం అమెరికాకు చాలా ఉందని ఆయన తాజాగా అంగీకరించారు. ఈ విషయాన్ని ‘మాగా’ మద్దతుదారులు అర్థం చేసుకోకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. అమెరికా-సౌదీ పెట్టుబడుల ఫోరంలో ఆయన మాట్లాడుతూ అమెరికాలో చాలా పెద్ద సంఖ్యలో ప్లాంట్లను నిర్మిస్తామని, వాటిలో పనిచేసేందుకు నైపుణ్యం కలిగిన విదేశీయులను తీసుకురావాల్సి ఉంటుందన్నారు. వారు అమెరికన్లకు కూడా ఆ నైపుణ్యాలను నేర్పించాలని ఆయన పేర్కొన్నారు. యూఎస్‌లోని కంపెనీల్లో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టి వారిని అనుమతించక పోతే తాము విజయం సాధించలేమని ఆయన అంగీకరించారు. విదేశీ వృత్తి నిపుణులు వేలాది మందిని తమతో తీసుకురావాలని, తాము వారిని స్వాగతిస్తామని చెప్పారు.
అమెరికా, భారత్ మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. అమెరికా ప్రభుత్వం భారత్‌కు రెండు కీలకమైన సైనిక పరికరాల విక్రయానికి ఆమోదం తెలిపింది. దాదాపు 93 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 775 కోట్లు) విలువైన ఈ ఒప్పందంలో అధునాతన ఎక్స్‌కాలిబర్ ప్రొజెక్టైల్స్, జావెలిన్ క్షిపణి వ్యవస్థలు ఉన్నాయి. ఈ డీల్‌లో 216 ఎం982ఏ1 ఎక్స్‌కాలిబర్ వ్యూహాత్మక ప్రొజెక్టైల్స్, 100 ఎఫ్‌జీఎం148 జావెలిన్ క్షిపణులు, 25 తేలికపాటి కమాండ్ లాంచ్ యూనిట్లు (సీఎల్‌యూ) ఉన్నాయి.