Donald Trump : గత కొన్ని వారాలుగా బాంబుల మోతతో, క్షిపణుల విధ్వంసంతో అట్టుడుకుతున్న పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు అడుగుల పడుతున్నాయి. ఇరాన్, అమెరికా కాల్పుల విరమణ కొనసాగుతున్న వేళ.. ఇజ్రాయేల్, లెబనాన్ సైతం యుద్ధాన్ని నిలిపివేసేందుకు అంగీకరించాయని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపారు. ఇరుదేశాలు 10 రోజుల కాల్పుల విరమణకు సమ్మతం తెలిపాయని గురువారం ట్రుత్ సోషల్ వేదికగా ట్రంప్ వెల్లడించారు. అంతేకాదు తాను ఇప్పటికే తొమ్మిది యుద్ధాలు ఆపానని, ఇది పదో యుద్ధమని అమెరికా అధినేత పేర్కొనడం గమనార్హం.
పశ్చిమాసియాలో శాంతి సుస్థిరతకు డొనాల్డ్ ట్రంప్ మధ్య వర్తిత్వం వహిస్తున్నారు. ఇజ్రాయేల్, లెబనాన్ మధ్య ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు వాషింగ్టన్లో ప్రత్యక్ష చర్చలకు ఆహ్వానించారు ట్రంప్. ‘ఈరోజు అధ్యక్షుడు జోసెఫ్ అవోనాతో, ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో సంభాషణ అద్భుతంగా సాగింది. ఇరువురు 10 రోజుల కాల్పల విరమణకు అంగీకరించారు.
President Donald J. Trump announces a 10-day ceasefire between Lebanon and Israel.
“It has been my Honor to solve 9 Wars across the World, and this will be my 10th, so let’s, GET IT DONE!” pic.twitter.com/YujXwyUReM
— The White House (@WhiteHouse) April 16, 2026
సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి రానుంది. రెండు వర్గాల మధ్య శాంతి స్థాపనకు ఇది తొలి అడుగు. ఇప్పటికే నేను 9 యుద్ధాలు ఆపాను. ఇది నేను ఆపిన పదో యుద్ధం. 34 ఏళ్ల తర్వాత వాషింగ్టన్ డీసీలో ఇజ్రాయేల్, లెబనాన్ ప్రతినిధులు సమావేశం కాబోతున్నారు’ అని ట్రంప్ వెల్లడించారు.