న్యూఢిల్లీ: గురుగ్రామ్‌లో బైక్‌పై వెళ్తున్న ఓ మహిళ రైడర్‌ను.. కారుతో ఓ వ్యక్తి ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఆ కేసులో నిందితుడు, కారు డ్రైవర్ కళ్యాణ్ బైన్సాల్ను పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని దౌసాలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గురుగ్రామ్ పోలీసులు ఈ కేసులో చర్యలు తీసుకున్నారు. నిందిత డ్రైవర్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. గురుగ్రామ్‌లో ఆదివారం గోల్ఫ్ కోర్సు రోడ్డులో ఓ తెలుపు రంగు సెడాన్ కారు .. బైక్ నడుపుతున్న రైడర్ సియాను ఢీకొట్టింది. కారు ఢీకొన్న తర్వాత ఆ లేడీ బైకర్ కింద పడిపోయింది. ఏప్రిల్లా ఆర్ఎస్ 457 స్పోర్ట్స్ బైక్‌లో వెళ్తున్న సియాను కారు డ్రైవర్ కళ్యాణ్ వెంబడించి మరీ ఢీకొట్టాడు. కారు, బైక్ ఢీకొన్న సీసీటీవీ దృశ్యాలు వైరల్ అయ్యాయి.

రాజ్‌ఘర్‌లో నిందిత కారు డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు గురుగ్రామ్ సీపీ సిబాశ్ కబిరాజ్ తెలిపారు. బీఎన్ఎస్ సెక్షన్ 109 కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. గోల్ఫ్ కోర్సు రోడ్డుపై మహిళా బైకర్‌ను కారు ఢీకొట్టిన ఘటనను సుమోటోగా స్వీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. సెక్టార్-56 పోలీసు స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు. లోతైన దర్యాప్తు, సీసీటీవీ ఫూటేజీ విశ్లేషణ తర్వాత హత్యాయత్నం కేసు బుక్ చేసినట్లు పోలీసులు చెప్పారు. దక్షిణ ఢిల్లీలోని కాల్కాజీలో ఉన్న బాధితురాలి ఇంటిని పోలీసు అధికారి మనోజ్ కుమార్ విజిట్ చేశారు. లేడీ బైకర్‌ను ఢీకొట్టిన ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమయంలో.. సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ పసికట్టినట్లు అధికారి చెప్పారు. కారులో ఉన్న వ్యక్తి తనను వెంబడించాడని, చేతులతో బెదిరింపు సంకేతాలు చేశాడని, పారిపోవడానికి ముందు కారుతో టూవీలర్‌ను ఢీకొట్టినట్లు బాధితురాలు సియా తెలిపింది.
THE BIKER’S VERSION.
After the man who mowed her down tried to play victim the woman biker makes a case against him purely on video evidence.
Astonishingly the police are yet to arrest her assailant.
Watch the video she refers to here again. pic.twitter.com/CGTLmLa26F— Rahul Shivshankar (@RShivshankar) September 15, 2026