Road Accident : ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటన హైదరాబాద్ శివార్లలోని హయత్నగర్ ఏరియాలో జరిగింది. హయత్నగర్ ఏరియాలోని కుంట్లూరు సమీపంలో ఈ ప్రమదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకునే లోపే స్థానికులు.. తీవ్రంగా గాయపడిన 20 మంది ప్రయాణికులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
హయత్నగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. 20 మందికి తీవ్ర గాయాలు
కుంట్లూర్ సమీపంలో ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ
తీవ్ర గాయాలపాలైన 20 మంది ప్రయాణికులను ఆసుపత్రికి తరలించిన స్థానికులు pic.twitter.com/wkx8edxpm9
— Telugu Scribe (@TeluguScribe) September 15, 2026