Donald Trump: ఇరాన్ ప్రతిపాదన సంతృప్తికరంగా లేదు: డోనాల్డ్ ట్రంప్
Donald Trump: శాంతి ఒప్పందం నేపథ్యంలో ఇరాన్ చేసిన ప్రతిపాదన సంతృప్తికరంగా లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. అయితే అమెరికాతో చర్చలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి తెలిపారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలతో రెండు నెలల సాగిన యుద్ధంపై ఇంకా ప్రతిష్టంభన నెలకొన్నది.
వాషింగ్టన్: ఇరాన్‌తో శాంతి ఒప్పందం అంశంలో ఆ దేశం చేసిన ప్రతిపాదన సంతృప్తికరంగా లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) తెలిపారు. అయితే అమెరికాతో చర్చలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి తెలిపారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలతో రెండు నెలలు సాగిన యుద్ధంపై ఇంకా ప్రతిష్టంభన నెలకొన్నది. మరో వైపు ఇరాన్ వార్ అంశంలో అమెరికా మిత్రదేశాలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా కొన్ని చర్యలకు పాల్పడుతోంది. జర్మనీలో ఉన్న సుమారు 5 వేల మంది సైనికులను అమెరికా ఉపసంహరించనున్నది.
జర్మనీ ఛాన్సలర్ ఫ్రైడ్రిచ్ మెర్జ్ వైఖరిని ఇటీవల ట్రంప్ ఖండించారు. హోర్ముజ్ జలసంధిలో నౌకలను దిగ్భంధనం ఓ పైరెట్ల తరహా కొనసాగుతున్నదన్నారు. ఇరాన్‌కు డీల్ చేసుకోవాలని ఉందని, కానీ ఆ ప్రతిపాదనల పట్ల సంతృప్తి లేదని వైట్‌హౌజ్ రిపోర్టర్లతో ట్రంప్ పేర్కొన్నారు. ఇరానీ నేతలు రెండుమూడు వర్గాలుగా చీలినట్లు ఆయన తెలిపారు. నేను అంగీకరించలేని విషయాలను వాళ్లు అడుగుతున్నారని అన్నారు. కానీ ఫోన్ ద్వారా సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఇరాన్ అణు ఆయుధాన్ని సమీకరించకుండా అడ్డుకుంటామన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

