న్యూయార్క్: పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో మంగళవారం ఇరాన్‌తో రెండు విడత చర్చలు జరగనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) తెలిపారు. కానీ ఆ చర్చలకు తమ ప్రతినిధులను పంపడంలేదని ఇరాన్ చెప్పింది. మంగళవారం జరిగే చర్చలు డీల్ కుదిరే అవకాశం ఉన్నట్లు ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. కీలకమైన సీజ్ఫైర్ అంశంపై మంగళవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా ట్రంప్ వెల్లడించారు. కానీ ఇస్లామిక్ రిపబ్లిక్ దేశం ఇరాన్ మాత్రం ఆ చర్చల్లో పాల్గొనేందుకు ఆసక్తిగా లేదు. తమ ప్రతినిధుల బృందాన్ని పంపే ప్రతిపాదన లేదని ఇరాన్ పేర్కన్నది. వైట్‌హౌజ్ ప్రతినిధులు జేర్డ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్. ఇస్లామాబాద్ చర్చల్లో పాల్గొననున్నట్లు ట్రంప్ తెలిపారు. ఒకవేళ టెహ్రాన్ తమతో ఒప్పందం చేసుకోకుంటే, అప్పుడు యావత్ ఇరాన్‌ను పేల్చివేస్తామని ఆయన హెచ్చరించారు. శుద్దీకరించిన యురేనియం అప్పగింత విషయంలో ఇరాన్, అమెరికా మధ్య డీల్ కుదరడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.