వాషింగ్టన్: పహల్గాం దాడి చాలా చెత్త పని అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆయన శనివారం రోమ్ వెళ్తూ ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకర్లతో మాట్లాడారు. కశ్మీర్ సమస్య వెయ్యి సంవత్సరాల నుంచి కొనసాగుతున్నదని అన్నారు. ఇరు దేశాల నేతలు తనకు సన్నిహితులేనని, కశ్మీర్, ఉగ్రవాద సమస్యను ఏదోలా వారే పరిష్కరించుకుంటారని చెప్పారు.
పహల్గాంలో ఈ నెల 22న జరిగిన ఉగ్రవాద దాడిని ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది. ఈ గర్హనీయ ఉగ్రవాద చర్యకు పాల్పడినవారిని, ఆర్గనైజర్లు, స్పాన్సర్లను చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పింది.