వాషింగ్టన్, జనవరి 24: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై మరోసారి చర్చ ప్రారంభమైంది. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన ఎడం చేతిపై గాయం కన్పించటమే ఇందుకు కారణం. దావోస్ వేదికగా గాజా శాంతి మండలిని ట్రంప్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఆ సమయంలో ఆయన ఎడమ చేతిపై గాయం కన్పించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అధ్యక్షుడి ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పందించారు. శాంతి మండలి కార్యక్రమంలో బల్ల మూల తగలడంతో అధ్యక్షుడి చేతికి గాయమైందని అన్నారు. ట్రంప్ కూడా స్పందిస్తూ, ఇదే విషయం పేర్కొన్నారు.