వాషింగ్టన్, మార్చి 20 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘నాటో’ కూటమి దేశాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హొర్ముజ్ జలసంధిని తెరిపించేందుకు తమతో కలసి రావాలని ఆయన ఇచ్చిన పిలుపునకు నాటో దేశాలు స్పందించకపోవడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. నాటో సభ్య దేశాలను పిరికివాళ్లుగా ఎద్దేవా చేసిన ఆయన.. మిమ్మల్ని గుర్తుంచుకుంటా అంటూ బెదిరింపులకు దిగారు.
అమెరికా లేకపోతే నాటో కూటమి ‘పేపర్ టైగర్’ మాత్రమేనని ఎద్దేవా చేశారు. ‘అణ్వాయుధ శక్తిగా మారుతున్న ఇరాన్ను అడ్డుకోవడంలో అప్పుడు ముందుకు రాలేదు. ఇప్పుడు ముడి చమురు ధరల గురించి ఫిర్యాదు చేస్తున్నాయి. అం దుకు కారణమైన హొర్ముజ్ను తెరువడంలో సైనిక చర్యకు మాత్రం ముందుకు రావడం లేదు. పిరికి వాళ్లు.. గుర్తు పెట్టుకుంటా’ అని ట్రూత్ సోషల్లో విమర్శించారు.