వాషింగ్టన్ : అమెరికన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానంలో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరే ముందు ల్యాండింగ్ గేర్‌లో సమస్య ఏర్పడింది. దీంతో టేకాఫ్‌ను రద్దు చేశారు. ఈ విమానంలోని 173 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందిని ఎమర్జెన్సీ స్లైడ్ ద్వారా సురక్షితంగా కిందికి దించారు.
ఈ విమానం మియామీ వెళ్లవలసి ఉంది. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. పైలట్లను కంట్రోలర్ హెచ్చరించినట్లు ఓ ఆడియో బయటపడింది. విమానం నుంచి పొగ వస్తున్నదని, మంటలు కూడా కనిపిస్తున్నాయని కంట్రోలర్ చెప్పినట్లు తెలుస్తున్నది.