Delta Variant : లండన్లో డెల్టా వేరియంట్ డేంజర్ బెల్స్..
Delta Variant : బ్రిటన్లో వందలాది మంది టీకాలు తీసుకున్న వ్యక్తుల్లో ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ సోకినట్లు గుర్తించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. టీకాలు వేసిన వ్యక్తులకు కూడా డెల్టా వేరియంట్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే సూచనలు ఉన్నాయని ఇంగ్లండ్ పబ్లిక్ హెల్త్ అధికారులు చెప్పారు.

లండన్ : బ్రిటన్లో వందలాది మంది టీకాలు తీసుకున్న వ్యక్తుల్లో ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ (Delta Variant) సోకినట్లు గుర్తించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. టీకాలు వేసిన వ్యక్తులకు కూడా డెల్టా వేరియంట్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే సూచనలు ఉన్నాయని ఇంగ్లండ్ పబ్లిక్ హెల్త్ అధికారులు చెప్పారు. టీకా వేసుకున్న వ్యక్తుల్లో డెల్టా వేరియంట్లు.. వ్యాక్సిన్ వేయించుకోని వారిలాగే వేగంగా వ్యాప్తి చెందుతాయని సంస్థ హెచ్చరించింది. కొవిడ్ ఆంక్షలను సడలింపు ఇచ్చిన తర్వాత, డెల్టా వేరియంట్ కేసులు బ్రిటన్లోని వివిధ ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తున్నాయి.
జులై 19 నుంచి ఆగస్టు 2 వరకు డెల్టా ఇన్ఫెక్షన్తో దవాఖానలో చేరిన 1,467 మందిలో 55.1 శాతం మందికి టీకా అందలేదని, అలాగే, 512 మంది (34.9 శాతం) రెండు డోసుల టీకాను పొందారని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ తెలిపింది. జూలై 19 న ఇంగ్లండ్లో లాక్డౌన్ ఆంక్షలు సడలించారు. ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, ఫైజర్-బయోటెక్ల టీకాలు ప్రస్తుతం బ్రిటన్లో ప్రజల కోసం ఉపయోగిస్తున్నారు. ఇప్పటివరకు, యూకేలో ఆడల్ట్ జనాభాలో 75 శాతం మంది రెండు మోతాదుల టీకాను పొందినట్లు అక్కడి గణాంకాలు చెప్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
గోల్డెన్ మ్యాన్ నీరజ్ చోప్రాకు ఈ ఫుడ్ అంటే ఇష్టమంటా..!
టోక్యో రైలులో కత్తిపోట్లు.. 10 మందికి గాయాలు
బ్యాంక్ ఆఫ్ బరోడాకు బంపర్ లాభం
ఓలా స్కూటర్లో రివర్స్ గేర్..
కుంభమేళాలో నకిలీ కొవిడ్ పరీక్షలు.. ఈడీ తనిఖీలు
హక్కులు-బాధ్యతల మధ్య సమన్వయం అవసరం: వెంకయ్య
జరాంజ్ను హస్తగతం చేసుకున్న తాలిబాన్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

