Swadesh Movement : చరిత్రలో ఈరోజు.. స్వదేశీ ఉద్యమానికి 116 ఏండ్లు
Swadesh Movement : పశ్చిమ బెంగాల్‌ను ముక్కలుగా చేసిన బిట్రిషర్లకు వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమం 116 ఏండ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ప్రారంభమైంది

పశ్చిమ బెంగాల్‌ను ముక్కలుగా చేసిన బిట్రిషర్లకు వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమం (Swadesh Movement) 116 ఏండ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ప్రారంభమైంది. 1905 జూలై 20 న బెంగాల్ విభజనను లార్డ్ కర్జన్ ప్రకటించగా.. అదే సంవత్సరం అక్టోబర్ నెలలో అమలులోకి వచ్చింది. బెంగాల్‌ను విభజిస్తూ లార్డ్ కర్జన్ తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. హిందు-ముస్లింలను విడదీస్తూ బ్రిటీష్ ప్రభుత్వం బెంగాల్‌ను ఐదు ముక్కలుగా విభజించింది. ఇదే స్వదేశీ ఉద్యమానికి నాందీగా నిలిచింది.
బెంగాల్ విభజనను నిరసిస్తూ కోల్‌కతాలోని టౌన్ హాలులో 1905 ఆగస్టు 7 న భారీ జన సభ నిర్వహించారు. ఈ సభకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది హాజరయ్యారు. బ్రిటీషర్ల తీరును నిరసనగా వారి ఆధ్వర్యంలో నడుస్తున్న కార్యాలయాలు, పాఠశాలలు, కోర్టుల సేవలు వినియోగించుకోకూడదని, వారి వస్తువులను వాడకూడదని తీర్మాణం చేశారు. ఇక్కడి నుంచే స్వదేశంలో తయారయ్యే వస్తువులను మాత్రమే ఉపయోగించాలని తీసుకున్న నిర్ణయంతో స్వదేవీ ఉద్యమం ఊపందుకున్నది. దాంతో విదేశాలకు చెందిన దుస్తులు, వస్తువులను దహనం చేయడం ప్రారంభించారు. కాళ్లకు చెప్పులు లేకుండా ఉద్యమంలో ప్రజలు పాల్గొనడం మొదలుపెట్టారు. దాంతో విదేశీ వస్తువుల అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయి, ఇక్కడ తయారుచేసే వస్తువుల అమ్మకాలు పెరిగిపోయాయి. హిందు-ముస్లిం మధ్య స్నేహం చెక్కుచెదరదని చాటేందుకు ఒకరికొకరు రాఖీలు కట్టుకోవడం ప్రారంభించారు.
నిరసనలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నప్పటికీ బ్రిటీష్ ప్రభుత్వం ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. అక్టోబర్ 16 న బెంగాల్‌ను విభజనను అమలుచేసింది. దాంతో తీవ్ర మనోవేధనకు గురైన భారతీయులు ఈ రోజును జాతీయ సంతాప దినోత్సవంగా జరిపారు. బ్రిటీషర్ల తీరును నిరసిస్తూ ‘అమర్ షోనార్ బంగ్లా’ అనే దీర్ఘకవితను రాశారు. ఈ కవిత తదనంతర కాలంలో బంగ్లాదేశ్ జాతీయగీతంగా మారింది.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
నేడు జాతీయ చేనేత దినోత్సవం
2018 : భారతదేశంలో తొలి ఐకియా స్టోర్ ప్రారంభం
1990 : సౌదీ అరేబియాలో ‘ఆపరేషన్ డిజర్ట్’ ను ప్రారంభించిన అమెరిక
1985 : వరల్డ్ అమెచ్యూర్ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్‌ను సాధించిన భారత ఆటగాడు గీత్ సేథీ
1972 : ఆసియా సంతతికి చెందిన వారు 90 రోజుల్లోగా దేశం విడిచివెళ్లాలని ఆదేశించిన ఉగాండా నాయకుడు ఇడి అమిన్
1944 : తొలి ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ ‘ది హార్వర్డ్ మార్క్ వన్’ ప్రారంభం
1941 : నోబెల్ బహుమతి గ్రహీత గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ మరణం
1606 : కింగ్ జేమ్స్-1 కొరకు షేక్స్పియర్ రచించిన ‘మాక్బెత్’ నాటకం ప్రదర్శన
ఇవి కూడా చదవండి..
షుగర్‌ను కంట్రోల్లో ఉంచుకోవాలా..? ఈ ఆహారాలను ట్రై చేయండి
కలోంజితో కరోనా ఇన్ఫెక్షన్కు చెక్..?!
ముక్కులో వెంట్రుకలు కట్ చేయొద్దా..? ఎందుకు..?
రానున్న ఐదేండ్లలో లక్ష దాటనున్న బంగారం ధర
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

