Plane Catches Fire | అమెరికాలోని ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో (Orlando airport) పెను ప్రమాదం తప్పింది. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు (Delta Air Lines flight) చెందిన విమానంలో అకస్మాత్తుగా మంటలు (Plane Catches Fire) చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు సకాలంలో స్పందించి విమానంలోని ప్రయాణికులను (passengers) అత్యవసర స్లైడ్ల సాయంతో బయటకు తరలించారు. ప్రమాద సమయంలో విమానంలో దాదాపు 294 మంది ఉన్నారు. వారంతా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
282 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సిబ్బంది, ఇద్దరు పైలట్లతో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ 1213, సోమవారం ఉదయం 11:15 గంటల సమయంలో ఓర్లాండో ఎయిర్పోర్ట్ నుంచి హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయానికి బయల్దేరింది. విమానం టేకాఫ్ కోసం రన్‌వేపై సిద్ధంగా ఉండగా.. విమానం ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎమర్జెన్సీ స్లైడ్స్ (emergency slides) నుంచి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
A Delta flight just caught on fire at the Orlando Airport 😳 pic.twitter.com/kmksyx5QIu
— Dylan (@dylangwall) April 21, 2025
Also Read..
Donald Trump: ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చీఫ్‌పై ట్రంప్ విమర్శలు.. అమెరికా స్టాక్స్, డాలర్ పతనం
Donald Trump | ఈ తప్పులు చేస్తే సహించేది లేదు.. డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక