Air India | అమెరికా నుంచి బయల్దేరిన ఎయిరిండియా విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నెవార్క్ నుంచి ఢిల్లీ బయల్దేరిన ఎయిరిండియా విమానం ( బోయింగ్ 777 -300 ER ఎయిర్‌క్రాఫ్ట్ )లో సాంకేతిక లోపం తలెత్తింది. ఇంజిన్‌లో నుంచి ఆయిల్ లీకవ్వడంతో ఉన్నపళంగా స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. ఈ సమయంలో విమానంలో 300 మంది ప్రయాణికులు ఉన్నారు.
నెవార్క్ నుంచి ఎయిరిండియా విమానం బయల్దేరిన కొద్దిసేపటికి ఇంజిన్‌లో నుంచి ఆయిల్ లీకవుతున్నట్లు పైలట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పైలట్లు స్వీడన్‌లోని స్టాక్ హోమ్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. ఈ సమయంలో విమానంలో నుంచి మంటలు చెలరేగే అవకాశం ఉండటంతో వాటిని ఆర్పేందుకు విమానాశ్రయం వద్ద భారీగా ఫైరింజన్లను కూడా మోహరింపజేశారు. అయితే విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో ప్రయాణికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌పై డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు.
Air India Newark (US)-Delhi flight (AI106) with nearly 300 passengers made an emergency landing at Sweden’s Stockholm airport after it developed a technical snag. All passengers safe. A large no.of fire engines were deployed at the airport as the flight made an emergency landing pic.twitter.com/Rdwfg9VOgx
— ANI (@ANI) February 22, 2023
ఇంజిన్ నుంచి ఆయిల్ లీక్ అవుతున్నట్లు గుర్తించిన వెంటనే దాన్ని షట్‌డౌన్ చేశారు. వెంటనే స్టాక్‌హోమ్‌లో ల్యాండ్ చేశారని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. సాంకేతిక సమస్య ఎలా తలెత్తిందనే విషయంపై ఇంకా తనిఖీ కొనసాగుతుందని చెప్పారు.