Afghan quake | ఆఫ్ఘానిస్థాన్ (Afghanistan)ను భారీ భూకంపం (Earthquake) వణికించిన విషయం తెలిసిందే. రిక్టరు స్కేలుపై 6 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ధాటికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఆదివారం రాత్రి సంభవించిన భూవిలయానికి అనేక ప్రాంతాలు శవాల దిబ్బగా మారాయి. ఈ విలయంలో మృతుల సంఖ్య 2 వేలు దాటింది. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రకృతి విలయంలో మరణించిన వారి సంఖ్య 2,200కు చేరినట్లు అధికారులు తెలిపారు. మరో 3640 మంది గాయపడ్డారు.
ఆదివారం రాత్రి సంభవించిన ఈ భూవిలయం నుంచి తేరుకోకక ముందే ఆఫ్ఘాన్‌లో మళ్లీ భూమి కపించింది. శుక్రవారం ఉదయం గంటల వ్యవధిలోనే మూడు సార్లు ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. తొలుత తెల్లవారుజామున 3.16 గంటలకు 4.9 తీవ్రతతో భూమి కంపించింది. ఆ తర్వాత ఉదయం 7 గంటలకు 5.2 తీవ్రతతో, 7.46 గంటలకు మరోసారి 4.6 తీవ్రతతో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మొలజీ (NCS) తెలిపింది. మూడు భూకంపాలు రాజధాని కాబూల్‌కు 120 కిలోమీటర్ల దూరంలో సంభవించాయి. గురువారం రాత్రి కూడా రెండు సార్లు భూమి కంపించింది. తొలుత రాత్రి 10.26 గంటలకు 5.8 తీవ్రతతో భూమి కంపించగా, అనంతరం 11.58 గంటలకు 4.1 తీవ్రతతో ప్రకంపణలు వచ్చాయి.
Also Read..
Elon Musk | ట్రంప్ విందుకు నాకు ఆహ్వానం అందింది.. కానీ వెళ్లలేదు : ఎలాన్ మస్క్
Donald Trump | ఇన్నాళ్లూ ఏడు.. ఇప్పుడు మూడు.. ఇంతకూ ట్రంప్ ఆపిన యుద్ధాలెన్నో..!
India at UN | యుద్ధ భూమిలో సమస్యలకు పరిష్కారాలుండవు.. ఉక్రెయిన్ పరిస్థితిపై ఐరాసలో భారత్