Danish Airport | డెన్మార్క్‌లో గత వారం రోజుల నుంచి డ్రోన్లు (Denmark Drones) కలవరం సృష్టిస్తున్నాయి. దేశంలోని విమానాశ్రయాల వద్ద డ్రోన్లు అకస్మాత్తుగా కనిపిస్తున్నాయి. దీంతో అనేక చోట్ల ఎయిర్‌స్పేస్ ఆందోళనకరంగా మారింది. తాజాగా డానిష్ ఎయిర్పోర్ట్ (Danish Airport) వద్ద అనుమానిత డ్రోన్ (Suspected Drone) కలకలం సృష్టించింది. గంటల తరబడి ఆ డ్రోన్ గగనతలంలో చక్కర్లు కొడుతుండటంతో.. అప్రమత్తమైన అధికారులు డానిష్ ఎయిర్‌పోర్ట్‌ను కొద్దిసేపు మూసివేశారు.
రెండు రోజులుగా డానిష్ ఎయిర్పోర్ట్స్పై అనుమానిత డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వీటి కారణంగా పలు డానిష్ ఎయిర్‌పోర్ట్స్‌ను గంటల తరబడి మూసివేయాల్సి వస్తోంది. ఇటీవలే రోజుల్లో డెన్మార్క్ హైబ్రిడ్ దాడుల బాధితురాలిగా మారిందని ఆ దేశ ప్రధాన మంత్రి మిట్టె ఫ్రెడరిక్సన్ (Mette Frederiksen) అన్నారు. ఇదొక అసాధారణ యుద్ధంగా అభివర్ణించారు. డ్రోన్ల కలకలం వెనుక రష్యా పాత్ర ఉండి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ‘యూరప్ భద్రతకు ముప్పు కలిగించే ఒకే ఒక్క ప్రధాన దేశం రష్యా’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ అనుమానిత డ్రోన్ల వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఇప్పటి వరకూ బాధ్యులను గుర్తించడంలో అధికారులు విఫలమైనట్లు చెప్పారు.
Also Read..
Benjamin Netanyahu | అరెస్ట్ భయం.. అమెరికా వెళ్లేటప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని ఏం చేశారంటే..!