Crocodile | జూ కీపర్‌పై దాడి చేసిన భారీ మొసలి.. భయంతో కేకలేసిన టూరిస్టులు
‘ఈ దేశం మొత్తంలో ఈ మొసలి మీద మాత్రమే నేను కూర్చోగలను’ అని చెప్పాడా జూకీపర్. ఆ మాటలు అలా ముగిశాయో లేదో.. అతను కూర్చున్న మొసలి టక్కున పక్కకు తిరిగి అతనిపై దాడి చేసింది.
‘ఈ దేశం మొత్తంలో ఈ మొసలి మీద మాత్రమే నేను కూర్చోగలను’ అని చెప్పాడా జూకీపర్. ఆ మాటలు అలా ముగిశాయో లేదో.. అతను కూర్చున్న మొసలి టక్కున పక్కకు తిరిగి అతనిపై దాడి చేసింది. ఆ జూ కీపర్ తొడను గట్టిగా పట్టేసి విసిరి కొట్టింది. ఈ ఘటన సౌతాఫ్రికాలోని క్వాజులూ నాటల్ ప్రావిన్స్‌లో వెలుగు చూసింది. ఇక్కడి క్రోకోడైల్ క్రీక్‌లో షాన్ లె క్లాస్ అనే వ్యక్తి మొసళ్లను చూసుకుంటూ ఉంటాడు.
అతను పెంచిన ఒక మొసలి పేరు ‘హానిబల్’. 16 అడుగుల పొడవుండే ఈ మొసలి 660 కేజీల బరువు ఉంటుంది. ఈ నెల 10వ తేదీన టూరిస్టులకు ఆ మొసలిని షాన్ పరిచయం చేశాడు. ఈ సమయంలో హానిబల్ పక్కనే మరో ఆడ మొసలి కూడా ఉంది. హానిబల్పై షాన్ కూర్చొని ఉండటం చూసిన అది అతని వైపు రాసాగింది. అది గమనించిన షాన్.. ‘ఈ ఆఫ్రికా మొత్తంలో దీనిపై మాత్రమే నేను ఇలా కూర్చోగలను’ అంటూ టక్కున పక్కకు వచ్చేందుకు ప్రయత్నించాడు.
అలా షాన్ తన వీపు మీద నుంచి దిగగానే పక్కకు తిరిగిన హానిబల్.. అతన్ని కాలును గట్టిగా పట్టుకొని పక్కకు విసిరేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సుమారు 30 ఏళ్లుగా ఈ మొసలి బాగోగులు చూసుకుంటున్నాడు షాన్. ఈ ప్రమాదం తమకు కూడా ఆశ్చర్యం కలిగించిందని జూ నిర్వాహకులు అంటున్నారు. పక్కనే ఉన్న ఆడ మొసలి వల్లనే హానిబల్ ఇలా ప్రవర్తించి ఉంటాడని భావిస్తున్నారు.
షాన్‌కు ఎలాంటి ప్రమాదం లేదని కూడా నిర్వాహకులు తెలిపారు. అతని కాలిపై రెండు దంతాల గాయాలు అయ్యాయని, అయితే తనకు తనే వాటిని కుట్టేసుకున్న షాన్.. 20 నిమిషాల తర్వాత మళ్లీ పనిలోకి వచ్చేశాడని చెప్పారు. గతంలో కూడా ఒకసారి ఇలాగే షాన్‌పై ఒక మొసలి దాడి చేసింది. దీంతో అతను 11 నెలలపాటు కుంటుకుంటూ నడవాల్సి వచ్చిందని సమాచారం. అలాగే హానిబల్ ఇలా మనుషులపై దాడి చేయడం కూడా ఇదే తొలిసారి అని తెలుస్తోంది.
Video Credit www.thesouthafrican.com
Croc Breeder attacked by ‘his’ Crocs – Again:
Earlier this month, Crocodile Creek farm manager Sean le Clus was…
Posted by Wild Heart Wildlife Foundation on Tuesday, September 20, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

