సోమవారం 18 జనవరి 2021
International - Dec 05, 2020 , 09:36:07

కోవిడ్ టీకాపై వ‌త్తిడి చేయం: బైడెన్‌

కోవిడ్ టీకాపై వ‌త్తిడి చేయం:  బైడెన్‌

హైద‌రాబాద్‌: ఒక‌వేళ క‌రోనా వైర‌స్ టీకా అందుబాటులోకి వ‌స్తే, అప్పుడు ఆ టీకాను తీసుకోవాల‌ని అమెరిక‌న్ల‌పై వ‌త్తిడి చేయ‌బోమ‌ని ఆ దేశాధ్య‌క్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తెలిపారు. అమెరిక‌న్లు అంతా మాస్క్‌లు ధ‌రించాల‌ని తాజాగా ఆ దేశానికి చెందిన అంటువ్యాధుల నివార‌ణ సంస్థ ఆదేశాలు జారీ చేసింది. వైర‌స్ సంక్ర‌మ‌ణ దేశంలో అత్య‌ధిక స్థాయిలో ఉన్న‌ట్లు సీడీసీ పేర్కొన్న నేప‌థ్యంలో బైడెన్ ఈ కామెంట్ చేశారు.  శుక్ర‌వారం అమెరికాలో కొత్త గా  2500 మంది మ‌ర‌ణించారు. సుమారు 2.25 ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. విల్మింగ్ట‌న్‌లోని డెలావేర్‌లో మాట్లాడిన బైడెన్‌.. క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్‌ను త‌ప్ప‌నిస‌రి చేయ‌డం లేద‌న్నారు.  అయితే అధ్య‌క్షుడి హోదాలో ప్ర‌జ‌లు సరైన చ‌ర్య‌లు తీసుకునేలా చేస్తాన‌ని  బైడెన్ అన్నారు. సుమారు 60 శాతం మంది అమెరిక‌న్లు వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆస‌క్తిగా ఉన్న‌ట్లు పీవ్ రీస‌ర్చ్ సెంట‌ర్ తెలిపింది.