ఆర్నెళ్ల తర్వాత చైనాలో కోవిడ్ మరణాలు నమోదు
China Covid deaths: ఆర్నేళ్ల విరామం తర్వాత తొలిసారి చైనాలో కోవిడ్ మరణం నమోదు అయ్యింది. దేశ రాజధాని బీజింగ్‌లో కోవిడ్ కేసులు అధికంగా ఉన్నట్లు అధికారులు వార్నింగ్ ఇచ్చారు. శనివారం నుంచి బీజింగ్‌లో కోవిడ్ వల్ల ముగ్గురు చనిపోయారు. దీంతో కోవిడ్ వల్ల మరణించిన వారి మొత్తం సంఖ్య 5229కు చేరుకున్నది. చైనాలో ప్రస్తుతం జీరో కో
బీజింగ్: ఆర్నేళ్ల తర్వాత తొలిసారి చైనాలో మళ్లీ కోవిడ్ మరణాలు నమోదు అయ్యాయి. దేశ రాజధాని బీజింగ్‌లో కోవిడ్ కేసులు అధికంగా ఉన్నట్లు అధికారులు వార్నింగ్ ఇచ్చారు. శనివారం నుంచి బీజింగ్‌లో కోవిడ్ వల్ల ముగ్గురు చనిపోయారు. దీంతో దేశంలో కోవిడ్ వల్ల మరణించిన వారి మొత్తం సంఖ్య 5229కు చేరుకున్నది. చైనాలో ప్రస్తుతం జీరో కోవిడ్ విధానాన్ని పాటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోవిడ్ మరణాలు నమోదు కావడం ఆందోళకరంగా మారింది.
జీరో కోవిడ్ పాలసీని వ్యతిరేకిస్తూ చైనాలో నిరసనలు తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. ఇంకా లక్షల సంఖ్యలో జనం లాక్డౌన్లో ఉన్నారు. కొందరు పౌరుల్ని బలవంతంగా క్వారెంటైన్ చేశారు. బీజింగ్‌లోని హైదియన్ ప్రాంతంలో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. అక్కడ షాపులు, స్కూళ్లు, రెస్టారెంట్లు మూసివేశారు. 30 లక్షల మందిని ఇండ్లలోనే ఉండాలని ఆదేశించారు.
సిటీలోకి వెళ్లేవాళ్లకు వరుసగా మూడు రోజులు పరీక్ష చేయించుకోవాలి. ఆ తర్వాత ఆదేశాల మేరకు బయటకు రావాల్సి ఉంటుంది. బీజింగ్‌లో 2.1 కోట్ల జనాభా ఉన్న విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

