ముంబయి : ప్లేబ్యాక్ సింగర్ రాహుల్ వైద్య ఫేస్బుక్ పేజీ హ్యాక్ అయింది. ఇన్స్టాగ్రాం ద్వారా రాహుల్ ఈ విషయాన్ని గురువారం వెల్లడిస్తూ తన ఫేస్బుక్ ఖాతా నుండి వచ్చే పోస్టులను విస్మరించాల్సిందిగా అభిమానులకు తెలిపాడు. తన ఖాతాను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించాడు. పాపులర్ సింగింగ్ షో ఇండియన్ ఐడల్ ద్వారా వైద్య మొదటిసారిగా వెలుగులోకి వచ్చాడు. ఇటీవల బిగ్బాస్ 14లోనూ పాల్గొన్నాడు. స్టంట్ బేస్డ్ షో ఖత్రోస్ కే ఖిలాడి సీజన్ 11లోనూ కనిపించనున్నాడు.