ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌లో చర్చిని ధ్వంసం చేసిన దుండగులు పరిసర ప్రాంతాల్లోని క్రైస్తవులు నివసించే ప్రాంతాల్లో లూటీలకు తెగబడ్డారు. క్రైస్తవ మతస్తుడు దైవదూషణకు పాల్పడ్డాడనే అభియోగాలు రావడంతో గుర్తుతెలియని వ్యక్తులు విధ్వంసానికి పూనుకున్నారు.
దాడుల సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని పరిస్ధితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఫైసలాబాద్‌లోని జరన్‌వాలా తహసీల్‌లో ఈ ఘటన జరిగింది.
చర్చిపై దాడి అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్ధితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు పేర్కొన్నారు.
Read More :
Bill Gates: పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ ఫోటోతో బిల్ గేట్స్..