Bill Gates: పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ ఫోటోతో బిల్ గేట్స్..
Bill Gates: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గురించి బిల్ గేట్స్ ప్రశ్న వేశారు. తన పాడ్‌కాస్ట్ ప్రోగ్రామ్‌లో ఖాన్ అకాడమీ వ్యవస్థాపకుడు సాల్ ఖాన్‌ను సల్మాన్ గురించి అడిగారు. సల్మాన్ ఖాన్ వల్ల మీరెప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యారా అని ప్రశ్నించారు.
లాస్ ఏంజిల్స్: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. ఇటీవల స్వంతంగా పాడ్‌కాస్ట్ ప్రారంభించారు. అన్‌కన్‌ఫ్యూజ్ మీ విత్ బిల్ గేట్స్ అన్న ఆ ప్రోగ్రామ్‌కు మంచి స్పందన వస్తోంది. అయితే ఆ ప్రోగ్రామ్ రెండో ఎపిసోడ్లో.. అమెరికాకు చెందిన ఫేమస్ ఎన్జీవో సంస్థ ఖాన్ అకాడమీ వ్యవస్థాపకుడు సాల్ ఖాన్‌తో ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ చాలా సరదాగా సంభాషణ చేశారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గురించి సాల్ ఖాన్‌కు ప్రశ్న వేశారు. మీరెప్పుడైనా సాల్ ఖాన్ అని వెబ్‌లో సెర్చ్ చేస్తే, అప్పుడు ఈ వ్యక్తి కనిపిస్తారని బిల్ గేట్స్ తన వద్ద ఉన్న సల్మాన్ ఖాన్ ఫోటోను చూపించారు. ఆ సమయంలో సాల్ ఖాన్ నవ్వుకున్నారు. సల్మాన్ ఖాన్‌తో మీరు కన్ఫ్యూజ్ కాలేదా అని గేట్స్ మళ్లీ ప్రశ్నించారు.
ఆ ప్రశ్నకు బిలియనీర్ సాల్ ఖాన్ స్పందిస్తూ .. సల్మాన్ ఖాన్ గురించి తనకు తెలుసు అని, తాను అకాడమీ ప్రారంభించిన కొత్తలో.. ఆ నటుడి ఫ్యాన్స్ నుంచి తనకు పొరపాటున మెయిల్స్ వచ్చేవన్నారు. నువ్వంటే నాకు ఇష్టమని, కానీ మీరు గణితాలు ఎలా చేస్తారో అన్న టెన్షన్ ఉందని ఆ లేఖలో రాసేవారని సాల్ ఖాన్ తెలిపారు. దీంతో గేట్స్ నవ్వుకున్నారు. 2015లో ఇండియాలో టూర్ చేశానని, సల్మాన్ ఖాన్‌తో కలిసి ఓ టీవీ షోలో పాల్గొన్నట్లు ఈ సందర్భంగా గేట్స్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

