బీజింగ్: రక్షణ రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా దూసుకుపోతున్న చైనా మరో ముందడుగు వేస్తున్నది. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, రాకెట్ఫోర్స్కు తోడుగా అత్యాధునిక హైపర్సానిక్ ఆయుధాలతో కూడిన ‘నియర్ స్పేస్ కమాండ్’ను రూపొందించే పనిలో ఉన్నట్టు హాంకాంగ్ పత్రిక కథనాన్ని ప్రచురించింది.
అయితే, ఈ స్పేస్ కమాండ్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో స్పష్టంగా తెలియనప్పటికీ అభివృద్ధి దశలో ఉన్నట్టు వెల్లడించింది. అంతరిక్షమే తదుపరి యుద్ధభూమి అని విశ్వసిస్తున్న చైనా పరిశోధకులు ఈ ఆవిష్కరణకు తెరలేపినట్టు తెలిపింది. చైనాతో ప్రపంచం అప్రమత్తంగా ఉండాల్సి వస్తుందని హెచ్చరించింది.